AndhraPradesh
14, అక్టోబర్ 2011, శుక్రవారం
బాలాత్రిపుర సుందరి దేవి మొదటి రోజు (balatripurasundari devi day -1)
"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"
శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.
Bala Tripurasundari :
Bala Tripurasundari is the child form (about 7 to 9 years old) of Lalita Tripurasundari.
Her mantra generally provides a shishya's entry to Srividya. She is also said to be the strength of the Goddess.
According to Her dhyana, Bala (Baa-laa) is the color of the rising sun, smiling lightly; She has four hands. She holds a rosary and abook in Her two upper hands; the lower hands show the abhaya andvarada mudras. She is seated on a blue lily (*not* lotus).I do not know of any precise ontological relationship to Saraswati,other than to say they are both aspects of the one Devi.
"Both of them went to Lalita devi, expressed sorry for what had happened and made arrangements for protection. At the instance of Lalita devi, Jwalamalini devi made a compound wall of fire around the devi's army The fire wall is 100 yojana wide and 30 yojana tall. (1 yojana is approximately 8 miles).
At the southern end of fire wall is a 1 yojana long entry, toenable devi's army go out and fight because Shunyapuram is facingthis end.(L.S.N—jwalamalini kashipta vahniprakaramadhyaga. Stambhini devi a member of Dandanatha devi family along with 20 akshohini senas was protecting this entry point. She is also called Vighna devi. By then it was dawn
Knowing all this news Bhandasura was in despair and started thinking what to do. This time he sent all his 30 sons for the war. After listening to this news Lalita devi's daughter Bala devi wanted to fight these demons herself. Bala devi is the only daughter of Lalita devi .She resembles Lalita devi very much but is always only 9 years old. She stays permanently with her mother only. Bala devi approached her mother and requested for permission to fight in the battlefield. At the outset Lalita devi denied but looking at the courage and will power exhibited by Bala devi she ultimately gave permission. Seeing Bala devi coming for the war Mantrini and Dandanayaka were astonished , they stood as her body guards. Now Baladevi started ferocious fighting with Bhanda's sons.Every one was surprised at her valour. Whole of the second day Baladevi fought. That evening she shot 30 arrows at a time and killed 30 sons of Bhanda. Lalita devi was very happy and she embraced her daughter (L.S.N---Bhandaputravadhodyukta bala vikrama nandita) Bhanda was grief stricken. Desperately he himself started offf or the war. Vishukra and Vishanga pacified Bandasura"
Extract from English version of Lalitopakhyana by Ganapati Sachchidananda.
నైవేద్యం - పొంగలి
కావలసిన పదార్ధాలు
బియ్యం - ఒక గ్లాస్
పెసరపప్పు - ఒకటిన్నర గ్లాస్
పచ్చిమిర్చి - ఒకటి
మిరియాలు - పదిహేను
సెనగపప్పు - రెండు టీ స్పూన్స్
మినపప్పు - ఒక టీ స్పూన్
జీల కర్ర- అర టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
కరివేపాకు - పది ఆకులు
అల్లం (తురుము) ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయ - ఒకటి
జీడిపప్పు - ఏభై గ్రాములు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
నూనె - ఒక టేబుల్ స్పూన్
నీళ్లు - మూడు గ్లాసులు
ఉప్పు తగినంత
తయారు చేయు విధానం
కుక్కర్లో నూనె వేసి కాగనిచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం తురుము, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అందులో కడిగిన బియ్యం, పెసరపప్పు వేసి కొద్దిగా అటు ఇటు వేయించి ఉప్పు వేసి, నీళ్లు పోసి మూతపెట్టేయాయాలి. మూడు విజిల్స్ రానిచ్చి కుకర్ దించితే సరిపోతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి