AndhraPradesh

11, మార్చి 2010, గురువారం

మొత్తం మీద us వచేసాను

us వచ్చి ఇన్నాళ్ళు అవుతుంటే ఇప్పుడు us వచేసాను అంటోంది ఏమిటిరా అనుకుంటున్నారా? అదేమీ లేదు ఇనాళ్లు ఇక్కడ మనసు ఉంటేనే కదా. ఇండియా లోనే ఉండిపోయింది. ఇప్పటికైనా ఇక్కడికి రాకాపోతే కష్టం అని చెప్తే, ఉహు నేను రాను నాకు ఇండియా నే ఇష్టం అంటుంది . అరేయ్ అలాగా కాదురా నువ్వు ఇక్కడకి వచేయ్యు కావాలంటే మల్లి వేల్ధములే అంటే కష్ట పడి ఏడు సముద్రాలూ ఈదుకుంటూ మొత్తం మీద ఇప్పటికి వచ్చింది. అందుకే ఇప్పుడు నేను పూర్తిగా ఇక్కడకి వచినట్లు అన్నమాట .
ఏమిటో ఈ బ్లాగడం గట్రా నాకు చేత కాదు కాని, రేపు పొదున్న నాకు ఇవన్ని గుర్తు ఉండాలి కదా. అందుకనే ఏదో చిన్న ప్రయత్నం. రోజు రాయడం అవ్తుందో అవ్వదో తెలియదు కాని మొదలు పెట్టాను కదా చూడడము ఎంత రాస్తానో. ఇవాళ నాకు జ్వరం. అమ్మ మీద బెంగ కాదు , నాన్న ఇక్కడ లేరని కాదు , మా తమ్ముడు గాడికి పరీక్షలు . అందుకు నాకు జ్వరం వచ్చింది. ఎలా రాస్తాడో మరి రిజల్ట్స్ వచ్చాక చూడాలి. అయిన ఈ కాలం పిల్లలు బొత్తిగా పాడైపోయారు. చదువు లేదు సంధ్య ( అంటే అమ్మాయి కాదు ) లేదు. ఎం చెప్పిన సుద్ధ దండుగ. నేను ఇలా చెప్తాన వొరేయ్ తమ్ముడు చదువుకోర అని ..మాట వింటేనే కదా. నేను ఇలా offline వెళ్తాన వాడు మల్లి online వస్తాడు. మా అమ్మకి ఏమో తెలిదాయే. నేను చెప్తే వినడాయె. ఎలాగా వేళ్ళతో వేగేది? ( వేగడం అంటే నునిలో వేగినట్లుగా బాధలతో వేగడం అని కవి హృదయం). అందుకే జ్వరం వచ్చింది.
నాకు మంచి స్నేహితులు ఉన్నారండోయ్ , నాకు జ్వరం అని ఉపవాసం చేస్తారు. ఆహ ఇంకేమి కావాలి నాకు ఈ జన్మకి ఇది చాలు. బాబోయ్ ఇలా రాస్తూ ఉంది పోతే నా జ్వరం ఏమి కాను? నేను పాడుకోవాలి. మల్లి నిద్ర లేచాక బాగుంటే రాస్తాను.

ఉంటాను
మీ చౌమ్య పాప

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి