AndhraPradesh

11, మే 2010, మంగళవారం

కొన్ని తవికలు -- నేను రాసినవి

ఆగిపోకు కాలమా ఆశ తీరే వరకు..
జారి పోకు మేఘమా ఝల్లు కురిసే వరకు....
వాడి పోకు పుష్పమా వసంతం వచ్చే వరకు...
మరచి పోకు మిత్రమా...మరణించే వరకు!!
------------------------------------------------------------
ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే
నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే
క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
ఏమి చేయను నేస్తమా....!

------------------------------------------------------------
అమ్మఅనే పిలుపులోని మాధుర్యం
చూపుల్లోని చల్లదనం
చేతి స్పర్సలో కమ్మదనం
మాటల్లో తీయదనం
ప్రేమలో నిష్కల్మషం
ఉంటుందా ఇంతకు మించిన గొప్ప వరం!!
------------------------------------------------------------
నీవు లేని జీవితం ఎడారిల అనిపిస్తోంది
ఎప్పటికైనా నిన్ను చేరుకోగలననే ఆశ ఎండమావిల కనిపిస్తోంది!!
------------------------------------------------------------
మాటల్లోని మౌనం
చూపుల్లోని కోపం
చేతల్లోని నిర్లక్ష్యం
వీటి కోసమా నా నిరీక్షణం??
-------------------------------------------------------------
ఆగదు నీ కోసం పయనించే కాలం
వర్షించే మేఘం
ఎగసే కెరటం
మనసులోని భావం
నీ మీద నాకున్న ప్రేమ!!
--------------------------------------------------------------

1 కామెంట్‌: