ఏమిటో కొన్ని కొన్ని సార్లు కలలు నిజమైతే బాగున్ను అనిపిస్తుంది. నిన్న రాత్రి నాకు అలంటి కలే ఒకటి వచ్చింది. మీకు ఎప్పుడు చెప్తూ ఉండే దాన్ని గుర్తు ఉందా? నేను ఒక రామ చిలుకని పెంచేదానిని అని. ఇప్పుడు నా కలలో అదే హీరో. ముందు దాని గురించి చెప్తాను వినండి.
అవి నేను నాలుగో తరగతి చదివే రోజులు. నేను మెడ మీద ఆడుకుంటూ ఉంటె రామ చిలుక అరుస్తోంది పాపం చాల సేపటి నుండి. ఏంటి ఇంకా ఆపడం లేదు అని అనుకుంటుంటే అది ఇంకా గట్టిగ అరవడం మొదలు పెట్టింది. మా మెడ మీద గూట్లో బోల్డు రామ చిలుకలు ఉండేవి. అందుకే ముందు అక్కడికి వెళ్ళాను.కానీ అక్కడ నుంచి కాదు. అలా కిందకి చూస్తే అక్కడ ముళ్ళ గోరింట ( అదే ఎల్లో కలర్ లో ఉంటాయే డిసెంబర్ పువ్వులు అంటారు ఆ జాతికి చెందినది లెండి , బోల్డు ముళ్ళు ఉంటాయి) పొదల్లో రామ చిలుక ఇరుక్కున్ది . అది ఏడుస్తోంది రక్షించండి అని. పాపం కదా నేను అప్పుడు యా ముళ్ళు లోకి వెళ్లి దాన్ని కాపాడాను. దాని రక్కలు బాగా దెబ్బతిన్నాయి . ఎగర లేకపోయింది. మా అమ్మ అంది రెక్కలు వచేదాక మనమే పెంచుదాము అని. సరే అని దానికి ఒక పంజరం కొని తెచాను. రోజు జమ పండు తినేది. ఉదయం లేవగానే నన్ను పలకరించేది. మొక్క జొన్న గింజలు అంటే దానికి ప్రాణం. దానికి చాలానే ఫీట్లు నేర్పించాను.
ఒక రోజు పోదున్నే అది నన్ను పలకరించలేదు. పంజరం లో పడుకొని ఉంది. ఏమి అయ్యిందో తెలియ లేదు . చాల ఏడ్చాను. పాపం కదా అది చెప్పలేదు ఏమి అయ్యిందో . నోరు లేదు. అప్పట్లో మా విజయనగరం లో ఒకేఒక పశువుల డాక్టర్ ఉండేవాడు. అతని దగ్గరకు తిస్కేల్తే దానికి కడుపు నొప్పి వచ్చింది అని తేల్చాడు. దాన్ని ఇంకా వదిలెయ్యమని చెప్పాడు. పాపం కదా ఎన్నాళ్ళు బందిస్తాము. అది వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకుని ఉంటుంది. అందుకే దానికి మందు వేసి వదిలేసాను. అది ఎగిరిపోయింది. అప్పుడప్పుడు వస్తు ఉండేది నన్ను పలకరించడానికి. తరువాత చాల కాలానికి రాలేదు.
ఇప్పుడు నాకు వచ్చిన కల గురించి చెప్తాను. మా రాము గాడు ( రామచిలుకకు నేను పెట్టుకున్న పేరు) నా కోసం ఇక్కడకి అంటే us కి ఎగురు కుంటూ వచాడు అంట. నేను ఏమో అయ్యో నీ రెక్కలు నొప్పెడుతాయి కదా ఎందుకు వచ్చేవు అని తిట్టాను అంట. ఇక్కడ నువ్వు ఉండలేవు. వెళ్ళిపో అని చెప్పను అంట. అప్పుడు వాడు సరే అనీ మల్లి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అంట. అప్పుడప్పుడు ఎందుకోస్తాయో తెలిదు కాని ఇలాంటి కలలు వచ్చి బాధ పెడతాయి. ఏమిటో ఈ పోస్ట్ మా రాము గాడికి అంకితం.

hmm very emotional story
రిప్లయితొలగించండిNijam...
రిప్లయితొలగించండిhmmmm nice one
రిప్లయితొలగించండి