ఝల ఝల పారే సెల యేరు నుంచి వచ్చే స్వచమైన గాలి ,
మావి చిగురు చాటున కోయిల రాగం,
నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటే
అలుపు లేకుండే తిరిగే కాలం సాక్షిగా వచేసింది
వికృతి నామ సంవత్సరం.
" వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు "
ఇవాళ ఉగాది ఎలా జరిగింది అంటే :
నిన్న రాత్రి ఆలస్యముగా గా పడుకున్నందున ఉదయం లేవలేదు. లేపుతా అని మాట ఇచ్చిన స్నేహితులు ఏమో లేవలేదాయే. ఏమి చేస్తాము పెమ్మ గారి ఫోన్ తో నిద్ర లేచాము. అప్పుడు అనిపించింది పండుగ రోజు ఇలా పడుకోడం ఏమిటి , అబ్బాయిలే మంచివారు చక్కగా ఉదయాన్నే లేస్తారు. ఏమి చేద్దాము అని ఆలోచిస్తుండగా...మా శ్రీలత స్నేహితులు ఉగాది పచడి , ఇంకా బొబ్బట్లు చేసుకున్నట్లు సమాచారం అందినది(మాకు ఇవ్వలేదు లెండి ). ఇంకా మనం ఆగుతామా? అంతే చక చక స్నానం చేసేసి, దేవుడికి దణ్ణం పెట్టేసుకొని వంట మొదలు పెట్టేసాను. సరే ఒక్క బొబ్బట్లు చేస్తే ఎం బాగుంటుంది, పులిహోర చేసేద్దాం అనుకున్నాను. మనం అనుకుంటే ఆగాము కదా .... చెయ్యడం మొదలు పెట్టాము...
పాపం మా శ్రీ కి ఇవాళ పరీక్షా లేకపోతేన? నన్ను వంట చెయ్య నిచ్చేదే కాదు.....ఇవాళ నాకు ఛాన్స్ ఇచింది అన్నమాట.... హమయ్య దొరికిందే ఛాన్స్ అని పొంగి పోయి గరిట చేతపట్టి చక చక పులిహోర కానిచ్చేశాను . ఇంకా తరువాతి కార్యక్రమం బొబ్బట్లు. పప్పును ఉడక పెట్టి, బెల్లం తురిమి, వాటిని కలిపి, మొత్తం మీద పూర్ణం చేసాను ( ఇది చేసేసరికి తాతలే కాదు వాళ్ళకి తాతలు కూడా దిగి వచ్చారు).
ఇప్పుడు ఇవి సరిపోవు, పాయసం చేద్దాం అని ఎందుకో అనిపించింది. ( అది ఎవరు అంతగా తినలేదు అనుకోడి అది వేరే విషయం ) సరే అని పాయసం చేసేసాను . ఇంకా తర్వాత మల్లి బొబ్బట్లు మీద పడ్డాను. బుజ్జి బుజ్జి గా భలే వచ్చాయి. ఎంత బాగున్నాయో. నన్ను నేనే పోగుడుకోవాలి..... :)
ఇది ఇలా ఉండగా, మా శ్రీలత వచ్చింది...నాకు చాల సహాయం చేసింది.... చెప్పనే లేదు ! నివేదిత ఇవాళ చాల పెద్ద సహాయం చేసింది. నేను ఎప్పటికి మర్చిపోలేను. ధన్యవాదములు మీ ఇరువురికి.
మా ఆహ్వానం మన్నించి వచ్చిన స్నేహితులకు నా ధన్యవాదములు. మీకు అవి తిన్నాక ఒక సారి అయిన మీ ఉరిలో చేస్కునే పండుగ గుర్తు వస్తే నా ఈ చిన్ని ప్రయత్నం సఫలమైనట్లే !
మా చాయ చిత్రాలు చుడండి :)